Header Banner

ఈసారి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కాదా..? హోస్ట్ మార్పుపై ఇండస్ట్రీలో టెన్షన్! రచ్చే రచ్చ అంటున్న ఫ్యాన్స్!

  Tue Apr 08, 2025 10:51        Entertainment

తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. హీరో నాగార్జున హోస్ట్‌గా నిర్వహిస్తున్న బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటి వరకూ ఎనిమిది సీజన్‌లు పూర్తి చేసుకుంది. త్వరలో తొమ్మిదో సీజన్ మొదలు కానున్నది. ఈ నేపథ్యంలో హోస్ట్ మారే అవకాశం ఉందంటూ టాక్ నడుస్తోంది. నాగార్జున స్థానంలో మరో నట దిగ్గజం నందమూరి బాలకృష్ణ (బాలయ్య) రానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రతిసారి నాగార్జుననే కొనసాగిస్తే ప్రేక్షకుల నుంచి అనుకున్నంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం లేదని యాజమాన్యం భావిస్తోందట. నాగార్జున హోస్ట్‌గా సమర్ధవంతంగా, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ షో నిర్వహిస్తున్నప్పటికీ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నందున బాలయ్యను తీసుకువచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది.

బాలయ్య ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో నిర్వహిస్తూ హోస్ట్‌గా రాణిస్తున్నారు. అందుకే బాలయ్యను తీసుకువస్తే టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారని అంటున్నారు. పైగా బాలయ్య లాంటి మాస్ హీరో హోస్ట్ గా నిర్వహిస్తే ఆయన ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్‌కు అదనపు ప్రేక్షకులు అవుతారని యాజమాన్యం భావిస్తుందని అంటున్నారు. అందుకే నిర్వాహకులు ఇప్పటికే బాలయ్యతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో తొమ్మిదో సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ లోగా బాలయ్యను హోస్ట్‌గా ఒప్పించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయితే బాలయ్య ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లతో పూర్తి బిజీ షెడ్యూల్‌లో ఉన్నారు. మరోపక్క అన్‌స్టాపబుల్ షోతో పాటు హిందూపురం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో కొనసాగుతున్నందున బిగ్‌బాస్‌ హోస్ట్‌గా సమయం కేటాయిస్తారా లేదా అనేది వేచి చూడాలి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BiggBossTelugu9 #NagarjunaOut #BalayyaIn #HostChangeBuzz #TollywoodBuzz